Namaste NRI

అమెరికాలో మరో ఆలయం పై

అమెరికాలో హిందూ ఆలయాలపై  దాడి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని బాప్స్‌ శ్రీ స్వామి నారాయణ మందిరం పై ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు రాసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. హిందూస్‌ గో బ్యాక్‌  సందేశాలతో ఆలయాన్ని అపవిత్రం చేసినట్లు చెప్పారు.

అంతేకాకుండా అక్కడికి వెళ్లే నీటి పైపుల్ని సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. శాంతి కోసం ప్రార్థనలతో ఇలాంటి విద్వేషాన్ని ఎదుర్కొంటామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు శాక్రమెంటో పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఘటన నేపథ్యంలో స్థానిక హిందూలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం వద్దకు చేరుకొని, ప్రార్థనల్లో పాల్గొన్నారు. శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు. కాగా, పది రోజుల వ్యవధిలోనే ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి. దీనికి ముందు న్యూయార్క్‌లోని బాప్స్‌ మందిరం వద్ద దుండగులు ఇదేవిధంగా ప్రవర్తించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events