తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటైడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంంలో అక్టోబర్ 9న హౌంస్లౌలోని ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్ ఆడిటోరియం వేదికగా లండన్` చేనేత బతుకమ్మ` దసరా సంబురాలు నిర్వహిస్తున్నట్టు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. స్థానిక కరోనా నిబంధనలను, అలాగే వేడుకల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశయాల స్ఫూర్తితో మన సంస్కృతినీ విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ఎన్నో సంవత్సరాల నుంచి వేడుకలను నిర్వహిస్తున్నామని, ప్రవాస బిడ్డలంతా హాజరై తమ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలన్నారు. వేడుకలకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదన్నారు. కొన్ని సంవత్సరాలుగా టాక్ జరిపే బతుకమ్మ వేడుకలను చేనేత బతుకమ్మ గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసుల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.