![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-98.jpg)
ఐక్యరాజ్య సమితి సాధారణ సభ వేదికగా పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. ఉగ్రవాద పర్యవసనాలను ఎదుర్కోవాల్సిందేనంటూ ఆ దేశానికి చెప్పింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత ఐరాసలోని భారత దేశ ఫస్ట్ సెక్రటరీ భవిక మంగళనందన్ ఘాటుగా జవాబు చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాదంలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని మండిపడ్డారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజంను ప్రభుత్వ విధానంగా చేసుకున్న సుదీర్ఘ చరిత్ర పాక్‌కు ఉందన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-99.jpg)