దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. నెతన్యాహూ సైన్యం దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చి కోలుకోలేని దెబ్బకొట్టింది. మరోవైపు లక్ష్యం నెరవేరేవరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నది. నస్రల్లా మృతి, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది. దీంతో భద్రతా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-101.jpg)
కాగా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరూషన్ కూడా మరణించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ తమ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే నస్రల్లా మరణం లెబనాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-99.jpg)