ఆట సందీప్, శగ్నశ్రీ జంటగా రూపొందుతోన్న చిత్రం ది షార్ట్‌కట్. రామకృష్ణ కంచి దర్శకుడు. రంగారావు తోట, రజనీకాంత్ పున్నపు నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మెట్రో పాలిటన్ సిటీస్‌లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్‌పై ఈ సినిమా తీశామని, దీనికి పరిష్కారం కూడా చూపించామని దర్శకుడు చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు కూడా మాట్లాడారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎన్.మీరా, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)