సన్నీ హీరోగా పరిచయమవుతున్న తస్కరించుట చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శివప్రసాద్ చలువాది దర్శకుడు. రెచెల్ పిక్చర్స్ పతాకంపై షేక్‌అఫ్రీన్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్‌నివ్వగా, యువ హీరో ఆకాష్ పూరి కెమెరా స్విఛాన్ చేశారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశ మిదని, ప్రజెంటేషన్ సరికొత్తగా ఉంటుందని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అజయ్ ఎర్రగుంట్ల, సంగీతం: రోహిత్, కథ, స్క్రీన్‌ప్లే: పండు చరణ్, దర్శకత్వం: శివప్రసాద్ చలువాది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)