రాకేష్, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకుడు. పద్మ రావినూతుల, హిరణ్య నిర్మాతలు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, సైన్స్ ఫిక్షన్‌కు పౌరాణిక అంశాలను మేళవించి ఈ సినిమాను తెరకెక్కించామని, శ్రీచక్రం పేరణతో కథ రాశానని చెప్పారు. షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిపామని, మన పురాణాల గురించి సరికొత్త విషయాలను చెప్పబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి గ్యాని సంగీతాన్నందిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)