Namaste NRI

తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ..భారత్‌తో

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌  తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో, ప్రధాని మోదీతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని వెల్లడించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఆయన హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ అమెరికాతోపాటు, ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు.

బంగ్లాలో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తు న్నాని చెప్పారు. అల్లరి మూకలు హిందువుల ఇండ్లు, దుకాణాలను దోపిడీ చేశారని తెలిపారు. దీంతో ఆ దేశం లో తీవ్రమైన భయానక గందరగోళ పరిస్థితులు తలెత్తాయన్నారు. తన పాలనా సమయంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారని విమర్శించారు. ఇజ్రాయెల్‌ నుంచి మొదలుకొని, ఉక్రెయిన్‌, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఎన్నో ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేసి శాంతిని నెలకొల్పుతామని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events