కెనడా ప్రభుత్వం తన వీసా పాలసీని సవరించింది. 10 ఏండ్ల పాటు చెల్లుబాటయ్యేలా గతంలో అమలు చేసిన దీర్ఘకాలిక బహుళ ప్రవేశ పర్యాటక వీసాను జారీ చేసే విధానంలో మార్పు చేసింది. కొత్త నిబంధలన ప్రకారం పర్యాటకులకు ఏ విధమైన వీసాను జారీ చేయాలి, దానికి ఎంత గడువు నిర్దేశించాలి అన్న విషయా న్ని ఇమ్మిగ్రేషన్ అధికారులే నిర్ధారిస్తారు. దీంతో ఇకపై 10 ఏండ్ల దీర్ఘకాలపు వీసాల జారీ ఉండకపోవచ్చు. గతంలో ప్రభుత్వం సింగిల్, మల్టిపుల్ ఎంట్రీ వీసాలు జారీ చేసేది. మల్టిపుల్ ఎంట్రీ వీసాలు కలిగిన వారు ఆ నిర్దేశించిన 10 ఏండ్ల కాలంలో కెనడాకు ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చు. ఇలా మల్టిపుల్ వీసా తీసుకుని దేశంలో ఉంటున్న లక్షలాది మంది నివాసితులను దేశం నుంచి పంపే యోచనలో కెనడా ప్రభుత్వం ఉందని వార్తలొస్తున్నాయి.