Namaste NRI

రాష్ట్రంలో అరాచక పాలన : అనిల్‌ కూర్మాచలం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం విమర్శించారు. టీబీఆర్‌ఎస్‌ యూకే కార్యవర్గ సమావేశం లండన్‌లో ఘనంగా జరిగింది. ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాలైన సందర్భంగా ముఖ్య నాయకులంతా కేక్ కట్ చేసి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో రాష్ట్రాన్ని 20 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లిందని అన్నారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడి సోషల్‌మీడియా వేదికగా నిలదీయాలని ఎన్నారై కార్యకర్తలకు సూచించారు. అలాగే లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చే ప్రతి పిలుపునకు స్పందించి అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు ఉపాధ్యక్షుడు నవీన్‌ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే కార్యవర్గ సభ్యులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్‌ రెడ్డి, రాజేష్ వర్మ, శ్రవణ్ రెడ్డి, సాయి బాబా కోట్ల, అంజన్ రావు, తరుణ్, ఇస్మాయిల్, శ్రీకాంత్ జెల్లా, సురేశ్‌ బుడగం, గొట్టెముక్కల సతీశ్‌ రెడ్డి, రమేష్ ఎసెంపల్లి, అబుజార్, గణేశ్‌ పాస్తం, మధుసూదన్ రెడ్డి, మల్లా రెడ్డి,  ప్రశాంత్ కటికనేని, రామకృష్ణ,  రత్నాకర్ కడుదుల, సీక్క చంద్రశేఖర్ గౌడ్, రవి ప్రదీప్ పులుసు, శ్రీధర్ రావు, ప్రవీణ్ వీర, సురేష్ గోపతి, వెంకట్ రెడ్డిదొంతుల, హరినవాపేట్, సతీశ్‌ రెడ్డి బండ, రవి రేతినేని, గణేశ్‌ కుప్పాల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events