అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్, అంచనాలను తలకిందలు చేస్తూ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విక్టరీని ట్రంప్ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తాజాగా ట్రంప్, తన మనవరాళ్లతో సరదాగా గడిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Mayfair-32.jpg)
ఫ్లోరిడా గోల్ఫ్ క్లబ్‌లో మనవరాళ్లు కై ట్రంప్, ఛోలె ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడారు. అదే సమయంలో అక్కడికి టెస్లా బాస్ ఎలాన్ మస్క్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ట్రంప్ ఫ్యామిలీతో చేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కై ట్రంప్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సండేరోజు తాతయ్యతో అంటూ ట్రంప్‌తో ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా మస్క్‌తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేస్తూ మస్క్ అంకుల్ అయ్యారు అంటూ టెస్లా బాస్‌కు స్పెషల్ స్టేటస్ ఇచ్చింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/Ixora-32.png)