టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్ భారీ ఆఫర్ ప్రకటించారు. పిల్లల కానీ జంటల కోసం ఆయనో ప్రకటన చేశారు. ఎవరైనా మహిళలు తన వీర్య కణాల ద్వారా పిల్లల కోసం ఐవీఎఫ్ చికిత్స చేయించుకుంటే, అప్పుడు ఆ మహిళలకు అయ్యే వైద్య ఖర్చులను తానే భరించనున్నట్లు టెలిగ్రాం సీఈవో పావెల్ తెలిపారు. ఆల్ట్రావి టా ఫెర్టిలిలీ క్లినిక్ తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పావెల్ దురోవ్ ఫేమస్ వ్యక్తి అని, ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త అని, ఒకవేళ ఆయన ఆయన వీర్య కణాలను వాడితే, ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళలు ఆల్ట్రావిటా క్లినిక్‌ను సంప్రదించవచ్చు. 37 ఏళ్ల లోపు ఉండే ఆరోగ్యవంతమైన మహిళలు దీనికి అర్హులు.