కరేబియన్ దేశమైన డొమినికా దేశం ఆ దేశ అత్యున్నత పురస్కారం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అనే పురస్కారా న్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కాలంలో భారత్ అందించిన సేవల కు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. 2021 ఫిబ్రవరి నెలలో దాదాపు 70,000 డోసుల ఆస్ట్రాజెన్కా కొవిడ్ -19 వ్యాక్సిన్ ను ఇండియా, డొమినాకా దేశానికి పంపింది. ప్రధాని మోడీకి ప్రకటించిన ఈ అవార్డును డిమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్టన్ ఇండియా-కారికోమ్ సమాశంలో ప్రదానం చేస్తారు. అది గయానాలోని జార్జ్ టౌన్ లో నవంబర్ 19 నుంచి జరుగనుంది.