Namaste NRI

కెనడా మరో కీలక ప్రకటన… ఇక వారానికి 24 గంటలే

అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిబంధనల్ని కఠినతరం చేస్తున్న కెనడా, తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. క్యాంపస్‌ బయట అంతర్జాతీయ విద్యార్థుల పనిగంటల్ని వారానికి 24కు పరిమితం చేయాలన్న ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆ దేశ వలసలు, శరణార్థులు, పౌరసత్వం శాఖ మంత్రి మార్క్‌ మిల్లర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మొదట్లో చేసిన ప్రతిపాదనల ప్రకారం కొత్త నిబంధ నావళి అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించారు. దీంతో భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌ బయట వారానికి కేవలం 24గంటలు మాత్రమే పనిచేయడానికి అవకాశముంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress