Skip to main content

Namaste NRI

మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని..  ఫస్ట్ లుక్

సముద్రఖని ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం మిస్టర్‌ మాణిక్యం. నంద పెరియసామి దర్శకుడు. జి.పి.రేఖా రవికుమార్‌, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్‌ నిర్మాతలు. నిర్మాత, పంపిణీదారుడు ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అండ్‌ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు సునీల్‌ నారంగ్‌ శుభాకాంక్షలు అందించారు.సముద్రఖని మాట్లాడుతూ  విమానం తర్వాత నేను లీడ్‌ రోల్‌ చేసిన సినిమా ఇది. విమానం నాకు మంచి పేరు తెచ్చింది. మిస్టర్‌ మాణిక్యం అంతకు మించిన పేరు తెస్తుందని నా నమ్మకం. మానవతా విలువలే ఈ సినిమా ప్రధానాంశం అని తెలిపారు.

సముద్రఖనితోపాటు నాజర్‌, భారతీరాజా ఇలా మహామహులు ఈ సినిమాకు పనిచేశారని, నిర్మించిన మాతో పాటు పనిచేసిన అందరూ ఈ సినిమా విషయంలో సంతృప్తితో ఉన్నారని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు అనన్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తంబి రామయ్య, ఇళవరసు, వడివుక్కరసి తదితరులు ఇతర పాత్రధారులు. డిసెంబర్‌ 28న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events