Namaste NRI

మరోసారి అక్కసు వెళ్లగక్కిన కెనడా … దౌత్యవేత్తలపై

కెనడాలోని భారత దౌత్యాధికారులపై ఆడియో, వీడియో నిఘా పెట్టినట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న మన దేశ దౌత్యాధికారులపై ఆ దేశం ఆడియో, వీడియో నిఘా పెట్టిందని తెలిపారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు మన దేశ దౌత్యవేత్తలకు చెప్పారన్నారు. ప్రైవేట్‌ కమ్యూనికేష న్స్‌ను కూడా అడ్డుకుని, పరిశీలిస్తున్నట్లు తెలిపారన్నారు. దీంతో మన దేశంలోని కెనడా హై కమిషన్‌కు ఈ నెల 2న నిరసన తెలిపామని చెప్పారు. కెనడా చర్యలు అన్ని దౌత్య నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కెనడాలోని మనదేశ దౌత్యవేత్తలు ఇప్పటికే తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి ఈ వాస్తవాన్ని కెనడా సమర్థించుకోజాలదని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events