Namaste NRI

మీకు సుపరిచితుడు… మీలో ఒకడు…మీ సాగర్.. రామ్ నయా మూవీ  ఫస్ట్‌ లుక్

రామ్‌ పోతినేని కథానాయకుడిగా మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీబోర్సే కథానాయిక.  ఇంకా టైటిల్‌ని ఖరారు చేయని ఈ చిత్రంలో సాగర్‌ అనే పాత్రలో రామ్‌ కనిపించనున్నారు. శుక్రవారం ఆయన పాత్రను పరిచయం చేస్తూ మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్‌ అనే అక్షరాలు పొందుపరచిన రామ్‌ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇక ఈ లుక్‌ విషయానికొస్తే, వింటేజ్‌ ఫీలింగ్‌ కలిగేలా రామ్‌ లుక్‌ ఉండటం గమనార్హం.

పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్‌, లాంగ్‌ హెయిర్‌ అండ్‌ క్లీన్‌ షేవ్‌తో అందంగా నవ్వుతూ రామ్‌ ఈ ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైందని, ప్రస్తుతం హైదరాబాద్‌ శివారుల్లోనే షూటింగ్‌ జరుగుతున్నదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మధు నీలకందన్‌, సంగీతం: వివేక్‌-మెర్విన్‌, నిర్మాతలు: నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events