ఇరాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరాన్ స్పేస్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. సామన్-1 స్పేస్ టగ్‌ను పరీక్షించినట్లు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. సిమోర్గ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా సామన్-1ను ప్రయోగించారు. దీనితో పాటు రెండు అదనపు పేలోడ్స్‌ను కూడా ప్రయోగించారు. ఇమామ్ ఖోమినేఇ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించినట్లు ఇరాన్ మిలిటరీ వెల్లడించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/12/Ixora-16.png)
ఈ ప్రయోగంతో ఇరాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి స్పేస్ టగ్‌ను ప్రయోగించింది. స్వదేశీయంగా డిజైన్ చేసి, ఉత్పత్తి చేశారు. స్వంతగా తయారు చేసిన శాటిలైట్ లాంచ్ వెహికిల్ ద్వారా ఈ పరీక్ష చేపట్టారు. సామన్-1తో పాటు క్యూబ్‌సాట్, ఓ రీసర్చ్ పేలోడ్ కూడా ఉన్నది. భూ కక్ష్యలోకి ఆ పేలోడ్స్‌ను పంపించారు. టూ స్టేజ్ ఎస్ఎల్వీ సిమోర్గ్. దీంట్లో ద్రవ ఇంధనం ఉంటుంది. ఇరాన్ రక్షణ శాఖ దీన్ని డెవలప్ చేసింది. సుమారు 300 కిలోల బరువు ఉన్న పేలోడ్స్‌ను సామన్ మోసుకెళ్లింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/12/Mayfair-14.jpg)