సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బాలీవుడ్ యాక్షన్ చిత్రం జాట్. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. హీరో, పోలీస్ ఆఫీసర్ పాత్రల మధ్య సాగే డైలాగులతో టీజర్ మొదలైంది. హీరో డైలాగ్ అతని నటోరియస్ నేచర్, శత్రువులను భయపెట్టే విధ్వంస మార్గాన్ని సూచిస్తున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/12/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-18.jpg)
విలన్ల కాళ్లూ, చేతులు గొలుసులతో కట్టేసి, వేళ్లాడదీసి, వారిమధ్య నుంచి ఉద్వేగంగా, ఉద్రేకంగా వస్తున్న హీరో ఇంట్రడక్షన్ టీజర్‌లో హైలైట్. భారీ ఫ్యాన్‌ని చేతబూని హీరో చేస్తున్న ఫైట్ సీక్వెన్స్ మాస్ మెచ్చేలా ఉంది. మెయిన్ విలన్‌గా రణదీప్ హుడాను పరిచయం చేయడంతో ఈ టీజర్ ముగిసింది. వినీత్‌కుమార్‌సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబి, సంగీతం: ఎస్.థమన్.
![](https://namastenri.net/wp-content/uploads/2024/12/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-18.jpg)