సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో దేశాన్ని వీడిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు మరో షాక్ తగిలింది. అసద్ నుంచి ఆయన భార్య అస్మా విడాకులు కోరినట్లు తెలిసింది. తిరుగుబాటుదారులు ఆక్రమించడం తో అసద్ కుటుంబ సభ్యులతో కలిసి సిరియాను విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, రష్యాలో ఆశ్రయం పొందడం అసద్ భార్య అస్మాకు ఇష్టం లేదట. తన స్వస్థలం లండన్ వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అసద్ నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు తెలిసింది. విడాకుల కోసం రష్యా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రష్యాను దాటి లండన్ వెళ్లిపోయేందుకు కోర్టును ప్రత్యేక అనుమతి కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె అభ్యర్థనను రష్యా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
అస్మా ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు 1975లో జన్మించారు. అక్కడే పుట్టి పెరిగారు. 2000 సంవత్సరంలో సిరియాకు వచ్చారు. అదే ఏడాది డిసెంబర్‌లో అసద్‌తో అస్మా వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఆ దేశ మొదటి మహిళగా కొనసాగుతున్నారు. అసద్ – అస్మా జంటకు ముగ్గురు సంతానం.