ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్(90) కన్నుమూశారు. శ్యామ్ బెనగల్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. 1934లో హైదరాబాద్ స్టేట్‌లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనగల్ జన్మించారు. పద్మ శ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను శ్యామ్ బెనగల్ అందుకున్నారు.
సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొందారు. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలపై ఆయన సినిమాలు రూపొందించారు. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. శ్యామ్ బెనగల్‌కు పేరు తెచ్చిన సినిమాలు, అంకూర్(1974), నిషాంత్ (1975), మంతన్ (1976), భూమిక (1977), జునూన్(1978). ఇక జబర్‌దస్త్ డాక్యుమెంటరీని రూపొందించారు. పద్మశ్రీ (1976), పద్మభూషణ్ (1991), దాదాసాహెబ్ ఫాల్కే(2005) అవార్డులు వరించాయి. జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగల్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డులను అందుకున్నారు.