Namaste NRI

ఈ సారి కూడా సీసీఎల్‌  టైటిల్‌ మాదే

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌(సీసీఎల్‌) 11వ సీజన్‌ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభం కానుంది. సీసీఎల్‌ నాలుగు సీజన్లలో వరుసగా తెలుగు వారియర్స్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ లెగసీని కొనసాగించేందుకు మరోమారు తెలుగు వారియర్స్‌ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలుగు వారియర్స్‌ జెర్సీని ఆవిష్కరించారు. టీమ్‌ కెప్టెన్‌ అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ సీసీఎల్‌ ఆడుతూ పెరిగా. ఇప్పటికి నాలుగు సార్లు టైటిల్‌ గెలిచాం. ఈ సారి కూడా టైటిల్‌ మాదే. ఎంటైర్టెన్‌ చేయాలనే పాషన్‌తో వస్తున్నాం. ఈ నెల 14, 15 తేదీల్లో ఉప్పల్‌ స్టేడియంలో ఆడుతున్నాం.వచ్చి సపోర్ట్‌ చేయండి అని కోరారు.

క్రికెట్‌ అనేది నా ఛైల్డ్‌వుడ్‌ డ్రీం. సీసీఎల్‌ ఫార్మాట్‌తో నా కల నెరవేరింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌ ఇందూరికి థ్యాక్స్‌ చెప్పుకుంటున్నా. దేశంలోని ప్రముఖ మైదానాల్లో క్రికెట్‌ అడటం అదృష్టం. అఖిల్‌ అగ్రెసివ్‌ కెప్టెన్‌. తన ఎత్తుగడలు బావుంటాయి. సచిన్‌జోషి ఈ టీమ్‌కి ఓనర్‌తోపాటు ఆటగాడు కూడా. క్రేజీ టీమ్‌తో వస్తున్నాం కప్‌ కొడతాం అని ఎస్‌.ఎస్‌తమన్‌ నమ్మకంగా చెప్పారు. అఖిల్‌ పాషనేట్‌ క్రికెటర్‌ అని, తమన్‌ టీమ్‌లో స్పిరిట్‌ని తీసుకొచ్చారని, సచిన్‌ జోషి చెప్పారు. ఇంకా అశ్విన్‌, రఘు, ఆది, సామ్రాట్‌, సీసీఎల్‌ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్‌ ఇందూరి, రికా వ్యాలీ ఛైర్మన్‌ షోరబ్‌ అర్ఫాత్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events