అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయిన ప్రధాని నరేంద్రమోడీ పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఒకరిపై మరొకరికి ఉన్న స్నేహాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి ట్రంప్ సరదాగా సమాధానం ఇచ్చారు. ట్రంప్, మోడీ ఈ ఇద్దరిలో మెరుగ్గా బేరమాడేది ఎవరు ? అని మీడియా ప్రశ్నించింది. ఆ విషయంలో మోడీనే నాకంటే చాలా మెరుగ్గా బేరసారాలు ఆడగలరు. అందులో ఎలాంటి అనుమానం లేదు అని ట్రంప్ బదులిచ్చారు. అలాగే పరస్పర సుంకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుంకాలు, పన్నులు పరస్పరం ఉంటేనే న్యాయంగా ఉంటుంది అని స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ,దానిని ముగించుకుని స్వదేశానికి పయనమయ్యారు. వీరి భేటీలో సుంకాలు, వలసలు, ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
