అమెరికాలో ఉద్యోగాల కోత మొదలైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు, డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 75 వేల మందికి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయాలని ఆదేశాలు జారీచేసిన ట్రంప్ సర్కార్, తాజాగా వివిధ ఏజెన్సీలలో పనిచేస్తున్న 9500 మందికిపైగా కార్మికులపై వేటు వేసింది. తొలగింపునకు గురైనవారిలో ఫెడరల్ భూముల వ్యవహారాలు చూసే కార్మికులు, మిలిటరీ ప్రముఖుల కేర్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా ఇంటీరియర్ డిపార్ట్మెంట్లు, ఎనర్జీ, వెటరన్స్ అఫైర్స్, వ్యవసాయం, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
