
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీపడుతున్నట్లు తెలిసింది. ఈ వేసవి చివరి వరకు దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ అధ్యక్షురాలి పదవికి పోటీ పడిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హారిస్, ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఆమె త్వరలోనే నిర్ణయం ప్రకటించనున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్నాయి.
