
ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రపంచ దేశాల నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్, భారత ప్రధాని మోదీలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్, మోదీలు నోబెల్ మిషన్ చేపట్టినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణపై చర్చలు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందని, కానీ ఆ ఒప్పందానికి ముందు షరతులపై క్లారిటీ రావాలన్నారు.

2024 జూలైలో చేసిన ప్రతిపాదన ప్రకారం స్వల్పకాల పరిష్కారాలకు తాము అంగీకరించబోమని పుతిన్ పేర్కొన్నారు. కానీ యుద్ధ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్, రష్యా సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతినిధులు కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాలో భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ప్రతినిధులతో నిర్వహించిన చర్చల్లో 30 రోజల కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చింది.
