ఈ ఏడాది ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ దక్షిణాఫ్రికా నవలా రచయిత డామన్ గాల్గట్‌ను వరించింది. ఆయన రచించిన ది ప్రావిస్ నవల అవార్డుకు ఎంపికైంది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డులో ఒకటైన బుకర్ ప్రైజ్ కోసం ఇంతకు ముందు 2003, 2010లోనూ ఆయన రచనలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ఈ ఏడాది బుక్‌ప్రైజ్ రేసులో అమెరికన్ రచయితలు మరోసారి ఆధిపత్యం చెలాయించారు. పైనలిస్టులో ముగ్గురు రచయితలు రిచర్ పవర్స్ (బివిల్డర్‌మెంట్), మ్యాగీ షిప్‌స్టెడ్ (గ్రేట్ సర్కిల్) ప్యాట్రిసియా లాక్‌వుడ్ (నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్)తో పాటు శ్రీలంక రచయిత అనుక్ అరుద్ ప్రసంగం ( ఏ పాసేజ్ నార్త్) బ్రిటీష్ అండ్ సోమాలి రచయిత నదిపా మొహమ్మద్ (ది ఫార్చ్యూన్ మన్ ) రచనలు బుకర్ ప్రైజ్ కోసం పోటీపడ్డాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)