Namaste NRI

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది : సంతోష్ శోభన్

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కపుల్‌ ఫ్రెండ్లీ. మానస వారణాసి కథానాయిక. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ నిర్మిస్తున్నది.నిర్మాత ధీరజ్‌ మొగిలినేని తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తా. ఈ కథ ఇరవై ఏళ్ల పాటు గుర్తుండిపోవాలనే తపనతో పనిచేశాను. నా మనసుకు నచ్చిన గొప్ప కథ ఇది అన్నారు.

ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ మూవీ ఇదని దర్శకుడు తెలిపారు.ఈ సినిమా చూసిన అనుభూతిలో చాలా రోజులు ఉండిపోయానని, ఎన్నో ప్రేమకథలు చూస్తుంటాం కానీ ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్‌ అని ధీరజ్‌ మొగిలినేని చెప్పారు. ఈ సినిమాలో తాను మిత్ర అనే ధైర్యవంతురాలైన అమ్మాయిగా కనిపిస్తానని, చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్యూట్‌ లవ్‌స్టోరీ ఇదని కథానాయిక మానస వారణాసి చెప్పింది.ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌ పురుషోత్తమన్‌, సంగీతం: ఆదిత్య రవీంద్రన్‌, రచన-దర్శకత్వం: అశ్విన్‌ చంద్రశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events