Namaste NRI

కాన్సాస్ సిటీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

కాన్సాస్ సిటీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఆడావారికి ముగ్గుల పోటీలు, పిల్లలకు చదరంగం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలు జరుగుతున్నంత సేపు కళాకారులు అందరు మాతదేశంలో తమ సంక్రాంతి సంప్రదాయాలను సరదాగా నెమరు వేసుకున్నారు. కార్యక్రమానికి రేణుకా దేవి వేనుం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పోటీల్లో గెలిచిన వారికి దుర్గ తెల్ల, సుచరిత వాసం, రాధిక గాదె బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గం సభ్యులకు, స్పాన్సర్స్‌కు అధ్యక్షుడు మధు గంట, ట్రస్ట్ బోర్డ్ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి చేవూరు ధన్యవాదాలు తెలిపారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events