హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించిన చిత్రం బ్యాండ్‌మేళం. సతీష్ జవ్వాజీ దర్శకత్వం. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. తాళికట్టడం కలిసి ఉండటం కోసమే అయితే, మధ్యలో విడిచిపెట్టిన దానికి కాదురా, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా అని స్టోరీ నరేషన్ సందర్భంగా దర్శకుడు చెప్పిన డైలాగ్ నచ్చి ఈ సినిమాకు శ్రీకారం చుట్టానని నిర్మాత కోన వెంకట్ తెలిపారు.

తెలంగాణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథ ఇదని, ప్రతీ సీన్లో ఎమోషన్స్ పండాయని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రం హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీగా అందరిని ఆకట్టుకుంటుందని నాయకా నాయికలు తెలిపారు. మార్చి 13న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: సతీష్ జవ్వాజి.















