Namaste NRI

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం .. ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్ ప్రియమణి

వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతున్నది బెంగళూరు భామ ప్రియమణి. ఫ్యామిలీమ్యాన్‌ సిరీస్‌ బాలీవుడ్‌లోనూ ప్రియమణికి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆమె కీలక పాత్ర పోషించిన విజయ్‌ జననాయగన్‌ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఇదిలావుంటే అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్న ఓ ఇండో అమెరికన్‌ ప్రాజెక్ట్‌ కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రియమణిని సంప్రదించారు.

అందులోని కీలక పాత్రకోసం ప్రియమణిని ఎంపిక చేసుకున్నారు. హర్ష్‌ మహాదేశ్వర్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం,ఇండో అమెరికన్‌ సంస్కృతుల నేపథ్యంలో ఒక వలస కుటుంబం కొనసాగించే సున్నితమైన భావోద్వేగ ప్రయాణమని తెలుస్తున్నది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మోహిత్‌ రైనా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సివుంది.


Social Share Spread Message

Latest News