Skip to main content

Namaste NRI

వందశాతం నవ్వుకుంటారు.. ఆ బాధ్యత నాది : శ్రీ విష్ణు

హీరో శ్రీ విష్ణు విష్ణు విన్యాసంతో అలరించబోతున్నారు. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి నిర్మించారు. శ్రీ విష్ణు సరసన నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించింది. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ దర్శకుడు మారుతి చాలా కూల్‌గా ఉంటాడు. చాలా మంచి మనిషి. సినిమా తప్పితే మరో ప్రపంచం తెలీదు. విష్ణు విన్యాసం ఫస్టాఫ్‌ అంతా యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. సెకండ్‌ హాఫ్‌కి సినిమా ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా పూర్తి అయ్యేసరికి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది ష్యూర్‌ షాట్‌ సూపర్‌ హిట్‌ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకోడానికి రండి. 100% నవ్వుకుంటారు. ఆ బాధ్యత నాది అని అన్నారు.

ఆద్యంతం హాస్యప్రధానంగా అలరించే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. శ్రీవిష్ణు కామెడీ విన్యాసాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయని నిర్మాత సుమంత్‌ నాయుడు జి చెప్పారు. శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న సినిమా ఇదని, తన పాత్ర కూడా చక్కటి వినోదాన్ని పంచుతుందని కథానాయిక నయన్‌ సారిక చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events