Skip to main content

Namaste NRI

మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ రుక్మిణి టీజర్ లాంచ్‌

నిరంజన్‌, గ్రీష్మ నేత్రికా, ప్రియ, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న హారర్‌ కామెడీ చిత్రం రుక్మిణి. సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా గంగాధరరావు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. హీరో మంచు మనోజ్‌ ఈ టీజర్‌ని లాంచ్‌ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.ఈ సినిమాలో నటించడం పట్ల ప్రధాన పాత్రధారులంతా ఆనందం వెలిబుచ్చారు.

సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని, పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని నిర్మాత కట్టా గంగాధర్‌రావు నమ్మకంగా చెప్పారు. నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా వచ్చిందని, త్వరలోనే థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నదని దర్శకుడు సింహాచలం గుడిపూరి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్‌ ఆనంద్‌, సమర్పణ: నేలబల్లి కుమారి, నిర్మాణం: జీ సినిమా.

Social Share Spread Message

Latest News