Skip to main content

Namaste NRI

అమెరికా వర్సిటీల్లో తగ్గిన భారతీయ విద్యార్థుల చేరికలు

అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో భారతీయు విద్యార్థుల చేరిక గణనీయంగా 45 శాతం తగ్గిపోయింది. ప్రధాన అంతర్జాతీయ విద్యార్థి సమూహాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీఎంఏసీ) విడుదల చేసిన తాజా శ్వేతపత్రం ప్రకారం అగ్ర రాజ్యం జారీ చేసే స్టూడెంట్‌ వీసాల్లో అనిశ్చితి, ఉద్యోగ అవకాశాలు క్షీణించడం, అమెరికాలో రోజుకో రకంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు దీనికి ప్రధాన కారకాలుగా పేర్కొన్నది.

అంతేకాకుండా భారతీయులకు భరించే సామర్థ్యం కూడా చేరికల నమోదు తగ్గడానికి కారణం. యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గణనీయంగా క్షీణించడంతో భారతీయ విద్యార్థుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కాగా, అమెరికాలో చైనా, దక్షిణ కొరియా, నైజీరియా, లాంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గినప్పటికీ, వీరితో పోలిస్తే భారతీయుల సంఖ్య చాలా అధికంగా ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events