Namaste NRI

ఆ దేశానికి ముందుముందు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తాం : బెంజామిన్‌

ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ముందుముందు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తామని చెప్పారు. ప్రజలు ఆ దేశంలోని ప్రభుత్వాన్ని పడగొట్టే క్షణం దగ్గరలోనే ఉందని అన్నారు. ఈ దాడులతో తాము ఇరాన్‌ను విభజించడానికి ప్రయత్నించట్లేదని, నిరంకుశ పాలన నుంచి ఆ దేశానికి విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇరాన్‌ విషయంలో తమ ప్రణాళికలోని తదుపరి దశను త్వరలో చేరుకోబోతున్నామని నెతన్యాహు అన్నారు.

తాము చేస్తున్న దాడులతో ఇప్పటికే కీలక నేతలను కోల్పోయి ఇరాన్‌ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. ఆ దేశంలోని ప్రస్తుత పాలనను అస్థిరపచడానికి, ప్రభుత్వంలో మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్కడి పాలక వర్గాన్ని గద్దె దించడానికి ఇదే సరైన సమయమని అన్నారు. ఇరాన్‌ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే స్వయంగా పడగొట్టాలని, అప్పుడే ఇరాన్‌-ఇజ్రాయెల్‌లలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events