Namaste NRI

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య

తెలుగు సినీదర్శకుల సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లో జరిగాయి. వీఎన్‌ ఆదిత్య, సాయిరాజేష్‌ ప్యానల్‌, వీరశంకర్‌ ప్యానల్‌, మద్దినేని రమేష్‌, కస్తూరి శ్రీనివాస్‌ ప్యానల్‌ ఈ ఎన్నికల్లో తలపడగా, వీఎన్‌ ఆదిత్య ప్యానల్‌ ఘన విజయాన్ని సాధించింది. నూతన అధ్యక్షుడిగా వీఎన్‌ ఆదిత్య ఎంపికయ్యారు. వి.సముద్ర, జర్నలిస్ట్‌ ప్రభు, ఎస్వీ భాస్కర్‌రెడ్డి ఉపాధ్యక్షులుగా ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల రామారావు, కోశాధికారిగా దర్శకుడు సాయిరాజేష్‌ ఎన్నికయ్యారు.

ఫలితాల అనంతరం నూతన అధ్యక్షుడు వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ దర్శకుల సంఘం అధ్యక్షునిగా నన్ను ఎంచుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. మా ప్యానల్‌లో 18మంది పోటీ చేస్తే, 16మంది గెలవడం ఆనందంగా ఉంది. చేసిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తాం. అసోసియేషన్‌ సభ్యుల అరోగ్య భద్రతే ఈ నూతన కమిటీ ప్రధాన కర్తవ్యం అని చెప్పారు. ఎన్నికైన అభ్యర్థులను పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుంది.

Social Share Spread Message

Latest News