Namaste NRI

శ్రీరామనవమి స్పెషల్.. ఇరుముడి ప్రత్యేక పోస్టర్

అగ్ర హీరో రవితేజ తన ఇరుముడి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రియా భవానీశంకర్‌ కథానాయిక. శివ నిర్వాణ దర్శకత్వం.ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చిత్రీకరణ 50శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ సతీష్‌ నేతృత్వంలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన ఓ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే సినిమా ఇదని పోస్టర్‌ చెబుతున్నది. ఈ పోస్టర్‌లో కూతురుతో కలిసి ముచ్చట్లు చెబుతూ నడుస్తున్న రవితేజను చూడొచ్చు. ఈ పోస్టర్‌లో ఆయన మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోనే భిన్నమైన పాత్రను ఇరుముడి లో పోషిస్తున్నారని, అయ్యప్పమాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబ నేపథ్యం కూడా ఉంటుందని, బలమైన భావోద్వేగాలతో ఈ సినిమా సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు.

ఈ చిత్రంలో సాయికుమార్‌, బేబీ నక్షత్ర, అజయ్‌ఘోష్‌, రమేష్‌ ఇందిర, స్వాసిక, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events