పింక్ ఎలిఫెంట్ పతాకంపై ఉమేష్‌కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం రాకాస. సంగీత్‌శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మానసశర్మ దర్శకత్వం. ఈ హారర్ కామెడీ మూవీ ఈనెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిహారిక మాట్లాడారు. కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ నాకు సమానమే. నచ్చింది చేయడానికే నిర్మాతను అయ్యాను. ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న అమ్మానాన్నకు థాంక్స్ చెబుతున్నా అని అన్నారు.

సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని, రాకాస సాధించబోయే విజయంలో సింహభాగం క్రెడిట్ సంగీత్‌శోభన్‌కే దక్కుతుందని, నయన్‌సారిక, గెటప్‌శ్రీను అద్భుతంగా నటించారని, ఆద్యంతం వినోదభరితంగా సినిమా ఉంటుందని నిహారిక కొణిదెల నమ్మకం వెలిబుచ్చారు. మేం మంచి సినిమా తీశామని నమ్ముతున్నాం. ప్రేక్షకుడు పెట్టే ప్రతి పైసాకూ ఈ సినిమా న్యాయం చేస్తుంది. ఎవర్నీ నిరాశపరచదు అన్నారు సంగీత్‌శోభన్. నిహారిక తన లక్కీఛార్మ్ అనీ, అద్భుతమైన టీమ్ పనిచేసిన ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని దర్శకురాలు మానసశర్మ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా నయన్‌సారిక, గెటప్‌శ్రీను తదితర చిత్రబృందంతోపాటు మైత్రి శశి, జీ స్టూడియోస్ ప్రతినిధి దివ్య విజయ్ కూడా మాట్లాడారు.















