Namaste NRI

హనుమాన్‌ జయంతి సందర్భంగా…పెద్ది నుంచి రామ్‌ చరణ్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌

ఇటీవల విడుదల చేసిన పెద్ది గ్లింప్స్‌లో కుస్తీ యోధుడిగా చిత్ర కథానాయకుడు రామ్‌చరణ్‌ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. సిక్స్‌ప్యాక్‌ బాడీతో పహిల్వాన్‌ అవతార్‌లో ఆయన స్క్రీన్‌ప్రజెన్స్‌ హైలైట్‌గా నిలిచింది. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన భారీ చెక్క గదను పట్టుకొని హనుమంతుడిని స్ఫురించేలా కనిపిస్తున్నారు. కుస్తీ ఆట తాలూకు శక్తియుక్తులు, హనుమంతుడి తాలూకు ఆధ్యాత్మికత మేళవింపుతో ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దినట్లు మేకర్స్‌ తెలిపారు.

పెద్ది చిత్రంలో రామ్‌చరణ్‌ ఆటకూలీ పాత్రలో కనిపించనున్నారు. 1980 దశకంలో సాగే పీరియాడిక్‌ రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 30న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. జాన్వీకపూర్‌, శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్‌ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌, నిర్మాణ సంస్థ: వృద్ధి సినిమాస్‌, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాత: వెంకట సతీష్‌ కిలారు, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events