Namaste NRI

అడివి శేష్ డెకాయిట్: సెన్సార్ పూర్తి

అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న క్రైమ్‌ డ్రామా డెకాయిట్‌. షానియల్‌ డియో దర్శకత్వం. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సెన్సార్‌ పూర్తయిందని, యు.ఏ. సర్టిఫికెట్‌ లభించిందని మేకర్స్‌ తెలిపారు. 13 ఏళ్ల విరామం తర్వాత కలుసుకున్న మాజీ ప్రేమికుల జీవన ప్రయాణానికి అద్దం పట్టే చిత్రమిదని, హృద్యమైన ప్రేమకథ, ఇంటెన్స్‌ యాక్షన్‌ కలబోతగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచాయని, అడివి శేష్‌ పాత్రలో భిన్నకోణాలుంటాయని ఆయన అన్నారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events