
చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సూర్య బి పాజిటివ్. సుబ్బా మాధవరపు దర్శకుడు. టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మురళీకాంత్ దేవసోత్, కౌశిక్ పెగల్లపాటి అతిథులుగా హాజరయ్యారు. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా వినూత్న కథాంశమిదని, నటుడిగా తనకు గుర్తింపు తీసుకొస్తుందనే నమ్మకం ఉందని హీరో చరణ్ పీసర్ల చెప్పారు. కొత్తదనంతో కూడిన కథలో భాగం కావడం ఆనందంగా ఉందని కథానాయికలు యానీ డయానా, దివ్య విశ్వకర్మ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్‌కుమార్ పర్వతనేని, సంగీతం: గ్యాని, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: బ్రిజేష్ తంగి, చరణ్ పీసర్ల, రచన-దర్శకత్వం: సుబ్బా మాధవరపు.















