Namaste NRI

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌కు పదవీ గండం?

అమెరికాలోని ప్రధాన విచారణ, నిఘా సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌కు పదవీ గండం పొంచి ఉంది. ప్రస్తుతం తన పదవిపై అనిశ్చిత స్థితి ఎదుర్కొంటున్న కాష్‌ను ఏ క్షణంలోనైనా పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ట్రంప్‌ కార్యనిర్వాహకుల్లో తొలగింపునకు గురయ్యే తర్వాతి పెద్ద అధికారి కాష్‌ పటేల్‌ అని వైట్‌హౌస్‌కు చెందిన ఒక అధికారి వెల్లడించారు. కాష్‌ తొలగింపు ఖాయమని, అది ఎప్పుడు అన్నది చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.

అమెరికాలో శనివారం కాల్పులకు కొద్ది గంటల ముందు కాష్‌ తొలగింపునకు సంబంధించిన ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది. కాష్‌ గతంలో సిఫార్సు చేసిన పామ్‌ బాండీని ట్రంప్‌ ఈ నెల ప్రారంభంలో అటార్నీ జనరల్‌ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాష్‌ పనితీరుపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అతని దుష్ప్రవర్తన, సమావేశాలకు గైర్హాజరీ, అధికంగా మద్యం సేవించడం వంటివి ఇందులో ఉన్నాయి.

Social Share Spread Message

Latest News