ప్రపంచంలోనే అతిపెద్ద రెమిటెన్స్‌లను స్వీకరించే భారత్ 2021లో 87 బిలియన్ల డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. యూఎస్ అతిపెద్ద వనరుగా 20 శాతానికి పైగా వాటా ఉందని ప్రపంచబ్యాంక్ నివేదికలో పేర్కొంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు చెల్లింపులు 7.3 శాతం వృద్ధి చెంది 2021లో 589 బిలిమన్ల డాలర్లకు చేరుకోవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ప్రవాసులు భారత్‌కు పంపించే సొమ్ము 2022లో మూడు శాతం వృద్ధి చెంది 89.6 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత్ తర్వాత చైనా, మెక్సికో, పిలిప్పీన్స్, ఈజిప్ట్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి.