ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో ఆమె మాట్లాడుతూ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బీజేపీ దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు, లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బీజేపీకి అలవాటు. మా నాయకులపై వేధింపులు మొదలయ్యాయి. ఇండియా బ్లాక్ కోసం మరింత గట్టిగా పని చేస్తా అన్నారు.

కాగా, సోమవారం వెలువడిన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 206 సీట్లు కైవసం చేసుకుంది. టీఎంసీ 81 స్థానాలకు పరిమితమైంది.





























