నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.సంయుక్త, నభానటేష్ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో యుద్ధవీరుడి పాత్ర కోసం నిఖిల్ చేసిన కఠోర శ్రమను చూపించారు. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రొఫెషనల్ ట్రెయినర్ల పర్యవేక్షణలో కత్తియుద్ధం, మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యల్లో శిక్షణ తీసుకున్నారని మేకర్స్ తెలిపారు.

వీడియో చివరలో చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. వీటిలో యుద్ధ కవచం ధరించిన నిఖిల్ శత్రువులపై విరుచుకుపడటం, అగ్ని జ్వాలల మధ్య పోరాటాలు రోమాంఛితంగా అనిపించాయి. ఈ సినిమాలో నిఖిల్ చోళ యుద్ధ వీరుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఓ సామాన్యుడు చారిత్రక పురుషుడిగా మారే వైనం కథలో ఆసక్తికర అంశమని చెబుతున్నారు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: భువన్, శ్రీకర్, రచన-దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.





























