Namaste NRI

అమెరికా మరో కీలక నిర్ణయం

రష్యా చమురు పై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియా లో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేయాలని భావిస్తుంది. మినహాయింపులు ఎత్తివేస్తే మళ్లీ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. రష్యా చమురుపై ఆంక్షలను నిలిపివేస్తూ కొనుగోలు కోసం ఇచ్చిన మినహాయింపులను ముగించాలనుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.

సెనెట్‌ విదేశీ సంబంధాల కమిటీ ముందు రూబియో విచారణను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపులను పొడిగించే ఉద్దేశం ఉందా అని ఒక సెనెట్‌ ప్రశ్నించారు. దీనికి రూబియో బదులిస్తూ చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. త్వరగా దీనిని ముగించాలనుకుంటున్నాం. ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాలపరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చాం అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events