Namaste NRI

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాత్ ఆయనతో ప్రమాణం చేయించారు. లోక్ భవన్ లోని గ్లాస్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, కేర‌ళ ముఖ్య‌మంత్రి శ్రీ స‌తీష‌న్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు, క‌ర్ణాట‌క హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విభూ బ‌ఖ్రూ, ఇతర ఏఐసీసీ నాయకులు పాల్గొన్నారు.

రాజ్యాంగం మినీ బుక్ చేతపట్టుకొని డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. అంతకు ముందు వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తన సీనియర్ అయిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను వేదికపైనే సత్కరించారు. జి. పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కుమారుడు యతీంద్ర , కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events