బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీ ధమాల్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ధమాల్ 4 అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. గత భాగాల లాగే ఈసారి కూడా కథ మొత్తం ఒక పెద్ద నిధి వేట చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అడవులు, కొండలు, దెయ్యాలు, పులులు, మొసళ్ల మధ్య హీరోల గ్యాంగ్ చేసే రచ్చ, కామెడీ పంచులతో థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సరికొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు హీరో అజయ్ దేవగన్ అధికారికంగా ధృవీకరించారు.

ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ అడ్వెంచరస్ కామెడీ ఎంటర్టైనర్లో అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్సి, జావేద్ జాఫేరి, సంజయ్ మిశ్రాలతో పాటు కొత్తగా రవి కిషన్, ఈషా గుప్తా, సంజీదా షేక్, అంజలి ఆనంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకేరియా, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.





























