Namaste NRI

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్

వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌లో, హిట్‌ మిషిన్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో, సాహు గారపాటి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ నుంచి హైదరాబాద్‌లో మొదలుకానున్నది. ఓ ఫన్నీ వీడియో ద్వారా ఈ విషయాన్ని మేకర్స్‌ వెల్లడించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి శైలిలోనే సరదాగా, విభిన్నంగా ఈ వీడియో సాగింది.
ప్రమోషన్స్‌లో, ఫిల్మ్‌ మేకింగ్‌లో మాస్టర్‌ని అంటూ అభిమానులు తనకు వీరఖడ్గాన్ని బహూకరించారని అనిల్‌ రావిపూడి ఖడ్గం చేతబూని చెప్పడం, ఊహించని విధంగా ఆ ఖడ్గంతో అనిల్‌ రావిపూడి బొటనవేలికి చిన్న గాటు పెట్టి, ఆ రక్తంతో అనిల్‌కి వెంకటేశ్‌ వీరతిలకం దిద్దడం, ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌, కీర్తి సురేశ్‌, కృతిశెట్టి, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కూడా అదే విధంగా చేయడం, ఇలా సరదా సరదాగా ఈ వీడియో సాగింది. ఈ సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో సాగే పూర్తి వినోదాత్మక చిత్రమనే విషయాన్ని కూడా ఈ వీడియోలోనే చిత్రబృందం రివీల్‌ చేసింది. జూన్ 22 నుండి అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌, శ్రీమతి అర్చన.

Social Share Spread Message

Latest News