Namaste NRI

మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ : సునీల్ కుమార్ రెడ్డి

ట్రాన్స్‌జెండర్స్‌ జీవితాలను, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ రూపొందిన కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఎల్‌ జి బీ టీ – ఏ లీగల్‌ బ్యాటిల్‌. ఎల్బీ శ్రీరామ్‌, ఎస్తర్‌, రాజు ఖేర్‌, ఆనంద చక్రపాణి, ప్రీతీ నిగమ్‌లతో పాటు రియల్‌ ట్రాన్స్‌జెండర్స్‌ ఇందులో కీలక పాత్రలు పోషించారు. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో సుభాష్‌ చక్రవర్తి రవడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్‌జెండర్స్‌కి అండగా నిలుస్తున్న పలు సేవా సంస్థల నిర్వాహకులను చిత్రబృందం సత్కరించింది. మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఎన్నో ఆర్గనైజేషన్స్, మీడియా మిత్రులు, ఛారిటీ సంస్థలు మా మూవీని ప్రశంసిస్తున్నాయి. ఈ సినిమా రూపొందించడం వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ట్రాన్స్ జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చెప్పేందుకు ఈ సినిమాను రూపొందించాను అని డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ఈ సినిమాతో సునీల్ కుమార్ రెడ్డి ఒక చరిత్ర సృష్టించారు. గే, ట్రాన్స్ జెండర్ సమస్యలు చెబుతూ వచ్చిన ఫస్ట్ సినిమా ఇదే. శంకరాభరణం సినిమా ఒక చరిత్ర సృష్టించింది. ఈ అర్థనారీశ్వర సినిమా మరో చరిత్ర సృష్టించబోతోంది అని తెలిపారు.

Social Share Spread Message

Latest News